కడుపు & అన్నవాహిక
అసిడిటీ & GERD
కడుపులోని యాసిడ్ పైకి ఆహార నాళం (ఫుడ్ పైప్) లోకి వచ్చినప్పుడు ఛాతీలో, గొంతులో మంట వస్తుంది, దీన్నే అసిడిటీ అంటాం. ఇది తరచూ వస్తుంటే డాక్టర్లు దీన్ని GERD అంటారు, చిన్న చిన్న మార్పులు, సరైన చికిత్సతో దీన్ని చాలావరకు బాగా కంట్రోల్ చేయవచ్చు.
ఇలా కూడా అంటారు: గ్యాస్ ట్రబుల్, గ్యాస్ సమస్య, ఛాతీలో మంట, పుల్లటి త్రేన్పులు, అజీర్తి
సాధారణ లక్షణాలు
- ఛాతీలో మంట, ఎక్కువగా భోజనం తర్వాత
- నోట్లో పుల్లని లేదా చేదు రుచి
- ఆహారం లేదా పుల్లని నీరు గొంతులోకి తిరిగి రావడం
- తరచూ త్రేన్పులు లేదా కడుపు ఉబ్బినట్టు అనిపించడం
- పడుకున్నప్పుడు లేదా వంగినప్పుడు ఎక్కువ అవ్వడం
- పొడి దగ్గు, గొంతు బొంగురు, ముఖ్యంగా ఉదయం పూట
- గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్టు అనిపించడం
కారణాలు & ప్రమాద కారకాలు
- ఎక్కువ మొత్తంలో, కారం లేదా నూనె ఎక్కువ ఉన్న భోజనం, లేట్‌గా డిన్నర్ చేసి వెంటనే పడుకోవడం
- బరువు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా పొట్ట చుట్టూ
- టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మద్యం ఎక్కువగా తాగడం లేదా పొగ తాగడం
- మెడికల్ షాప్‌లో నేరుగా కొనే నొప్పి మాత్రలు (NSAIDs)
- హయాటస్ హెర్నియా: కడుపులో కొంత భాగం డయాఫ్రమ్ పైకి జారడం
- గర్భం (ప్రెగ్నెన్సీ)
- టెన్షన్, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల లక్షణాలు ఎక్కువగా అనిపించవచ్చు
ఇవి ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవండి
- మింగడంలో ఇబ్బంది లేదా నొప్పి, ఆహారం మధ్యలో ఆగిపోయినట్టు అనిపించడం
- రక్తం వాంతి లేదా కాఫీ పొడిలా కనిపించే వాంతి
- నల్లగా, తారులా ఉండే మలం
- ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం లేదా ఆకలి తగ్గడం
- చెమటలు, ఆయాసం, చేయి లేదా దవడకు పాకే ఛాతీ నొప్పి: ఇది గుండె సమస్య కావచ్చు, ముందు ఎమర్జెన్సీకి వెళ్ళండి
- సుమారు 50 ఏళ్ళ తర్వాత కొత్తగా అసిడిటీ లక్షణాలు మొదలవడం
ఎలా నిర్ధారిస్తారు
మామూలు అసిడిటీని చాలావరకు లక్షణాలను బట్టే గుర్తిస్తారు, డాక్టర్ వెంటనే చికిత్స మొదలుపెట్టవచ్చు. లక్షణాలు తగ్గకపోయినా, మళ్ళీ మళ్ళీ వస్తున్నా, లేదా హెచ్చరిక సంకేతాలు ఉన్నా, అప్పర్ GI ఎండోస్కోపీ ద్వారా ఆహార నాళాన్ని, కడుపును నేరుగా చూసి వాపు, అల్సర్ లేదా ఇతర కారణాలు ఉన్నాయేమో డాక్టర్ చెక్ చేస్తారు.
ఉపయోగపడే పరీక్షలు
- డాక్టర్ కన్సల్టేషన్, లక్షణాల పరిశీలన
- అప్పర్ GI ఎండోస్కోపీ
- అవసరమైతే H. pylori టెస్ట్
- అవసరమైతే హిమోగ్లోబిన్ వంటి బ్లడ్ టెస్ట్‌లు
- కొందరికి pH లేదా మానోమెట్రీ టెస్ట్
చికిత్స మార్గాలు
కన్సల్టేషన్ తర్వాత, మీ పరీక్షలు మరియు రోజువారీ జీవనశైలిని బట్టి చికిత్స నిర్ణయిస్తారు.
- 01
ఆహారం, జీవనశైలి మార్పులు
తక్కువ మొత్తంలో భోజనం, త్వరగా డిన్నర్, తిన్న వెంటనే పడుకోకపోవడం చాలామందికి సహాయపడుతుంది. కొంచెం బరువు తగ్గినా మంచి తేడా కనిపిస్తుంది.
- 02
యాసిడ్ తగ్గించే మందులు
డాక్టర్ కొంత కాలం పాటు కడుపులో యాసిడ్ తగ్గించే మందులు ఇవ్వవచ్చు. వాటిని సూచించినట్టే వాడి, డాక్టర్‌తో రివ్యూ చేయించుకోవడం మంచిది, సొంతంగా ఏళ్ళ తరబడి వాడకూడదు.
- 03
అసలు కారణానికి చికిత్స
టెస్ట్‌లలో H. pylori ఇన్ఫెక్షన్, అల్సర్ లేదా ఏదైనా మందు వల్ల సమస్య వస్తోందని తెలిస్తే, ఆ కారణానికి చికిత్స చేస్తే లక్షణాలు తగ్గుతాయి.
- 04
కష్టమైన కేసులకు స్పెషలిస్ట్ కేర్
చికిత్స తర్వాత కూడా లక్షణాలు కొనసాగితే మరికొన్ని టెస్ట్‌లు అవసరం కావచ్చు, కొద్దిమందికి చర్చించిన తర్వాత ప్రొసీజర్ లేదా సర్జరీ సూచిస్తారు.
ఆహారం & రోజువారీ అలవాట్లు
- పడుకునే ముందు కనీసం రెండు మూడు గంటల ముందే డిన్నర్ చేయండి.
- ఒకటి రెండు సార్లు ఎక్కువగా తినే బదులు, తక్కువ మొత్తంలో సమయానికి తినండి.
- ఎక్కువ కారం, నూనె, వేపుళ్ళు తగ్గించండి, ఏ ఆహారం వల్ల మంట వస్తుందో గమనించండి.
- టీ, కాఫీ తగ్గించండి, మద్యం, పొగ, కూల్ డ్రింక్స్ మానేయండి.
- రాత్రిపూట లక్షణాలు వస్తే మంచం తల వైపు కొంచెం ఎత్తుగా పెట్టండి.
- పొట్ట చుట్టూ బిగుతుగా ఉండే బెల్ట్‌లు, బట్టలు వేసుకోకండి.
- ఒళ్ళు నొప్పులకు డాక్టర్‌ను అడగకుండా నొప్పి మాత్రలు వేసుకోకండి.
రోగులు తరచుగా అడిగే ప్రశ్నలు
15 నిమిషాల అపాయింట్‌మెంట్ బుక్ చేయండి
క్లినిక్‌లో లేదా ఆన్‌లైన్‌లో, సోమవారం నుండి శనివారం వరకు. సమయం ఎంచుకోండి, ఫ్రంట్ డెస్క్ నిర్ధారిస్తుంది.
ఈ పేజీ సాధారణ సమాచారం మాత్రమే, డా. తేజస్విని తుమ్మ సమీక్షించారు. ఇది డాక్టర్‌ను కలవడానికి ప్రత్యామ్నాయం కాదు.

